Sunday, February 25, 2024

డా.బీఆర్.అంబేద్క‌ర్ కు నివాళుల‌ర్పించిన స్పీక‌ర్ పోచారం

భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో తెలంగాణ శాస‌న‌స‌భాప‌తి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశాభివృద్ధికి ఎంతో చేశార‌ని.. దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర‌ సీఎం కేసీఆర్‌ పరిపాలన కొనసాగుతుందన్నారు. అయితే గత మూడు వారాల క్రితం కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్ లో ఉన్న స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా కోలుకున్న విష‌యం తెలిసిందే..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement