Monday, April 29, 2024

హే సినామిక మూవీ కోసం హైద‌రాబాద్ లో మ‌కాం వేసిన ‘దుల్క‌ర్ స‌ల్మాన్’

హే సినామిక చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు హీరో దుల్క‌ర్ స‌ల్మాన్. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అదితిరావు హైద‌రి, కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించారు. సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ఇది. ఈ మూవీ మార్చి 3న మలయాళ, తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు ఆడియెన్స్ నూ తనవైపు తిప్పుకునేందుకు దుల్కర్ సల్మాన్ చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే ఈ మూవీలో ప్రత్యేకంగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న కాజల్ అగర్వాల్, హైదరాబాదీకి చెందిన అదితి రావు హైదరీని హీరోయిన్లుగా ఎంచుకున్నారు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ రెండు రోజులుగా హైదరాబాద్ లోనే అడ్డా వేశారు. ‘హే సినామిక’ ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యనగరంలో షికారుచేశారు. నిన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేశారు. తెలుగులో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement