Wednesday, March 27, 2024

ఫిఫా నుంచి రష్యా బహిష్కరణ..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జా తీయంగా రష్యాపై వ్యతిరేకత ఆ దేశ క్రీడారంగంపై కూడా పడింది. తాజాగా రష్యా ఫుట్‌ బాల్‌ జట్లను ఈ ఏడాది జరగ నున్న ప్రపంచకప్‌ 2022తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌లు నుంచి బహిష్కరిస్తున్నట్లు (అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాసమాఖ్య) ఫిఫా, యూఈఎఫ్‌ఎ సంయుక్తంగా ప్రకటించాయి. తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు రష్యా పురుషుల జట్టు క్వాలిఫైయింగ్‌ ప్లే ఆఫ్‌ సెమీఫైనల్లో పొలాండ్‌తో మార్చి 24న తలపడనుంది. తదుపరి మ్యాచ్‌ రష్యా స్వీడన్‌ లేదా చెక్‌ రిపబ్లిక్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మూడు దేశాలు రష్యాతో ఆడేందుకు నిరాకరించాయి.

ఉక్రెయిన్‌ ప్రజల కోసం సంఘీభావంగా ఫుట్‌బాల్‌ ప్రపంచం ఐక్యంగా ఉందని ఫిఫా, యూఈఎఫ్‌ఎ తెలిపాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు మళ్లి సాధారణ స్థితికి చేరుకుంటుందని, పుట్‌బాల్‌ క్రీడ ప్రజల మధ్య శాంతి, సమైక్యతను నెలకొలుపుతుందని ఆశిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఎ అధ్యక్షులు జియాని ఇన్‌ఫాంటినో, అలెగ్జాండర్‌ సెఫెరిన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement