Sunday, May 5, 2024

Huzurabad Results: తొలి రౌండ్ లో ఈటల జోరు

ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో తొలి రౌండ్ ఫలితం వచ్చింది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీకి 4,444 ఓట్లు రాగా.. బీజేపీకి4,610, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ బీజేపీ అభ్యర్థి ఈటలకు 166 ఓట్ల ఆధిక్యం వచ్చింది.  

కాగా, మొదట 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఆధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం ఈవీంఏంలలోని ఓట్లను లెక్కింపును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement