Thursday, April 25, 2024

నెవాడ గనినుంచి ప్రతీ ఏటా లక్షల కిలోల బంగారం ..ఎక్క‌డ ఉందో తెలుసా..

బంగారం మ‌హిళ‌ల‌కే కాదు అంద‌రికీ ఇష్ట‌మే..ఈ మ‌ధ్య కాలంలో పురుషులు కూడా బంగారాన్ని ప‌లు ఆభ‌ర‌ణాల రూపంలో వాడుతున్నారు. బంగారం అంటే ఓ భరోసా కూడా.వ్యవసాయానికైనా. వ్యాపారానికైనా..హాస్పిటల్ ఖర్చులకైనా ఇలా కష్టంలో ఆదుకునేది ..ఇంటిలో ఉండే చిన్నా చితకా బంగారం వస్తువులే. కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొంటుంటారు.. వాడ‌కం మాటేమో గాని బంగారం ధ‌ర మాత్రం అమాంత ఆకాశానంటుతోంది. అలా అని కొనేవారు త‌గ్గ‌రా అంటే త‌గ్గేదే లే అంటున్నారు బంగారం వినియోగ‌దారులు. బంగారం బంగార‌మే..దాని విలువ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం అనేది ఉండ‌దు..అందుకే బంగారాన్ని అంత అపురూపమ‌యింది భారతీయుల‌కు..అంతేకాదు…

అస‌లు బంగారం ఎక్కడ నుంచి వస్తుంది ..ఇదేం ప్ర‌శ్న‌.. గనుల్లోంచేగా అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మరి ప్రపంచంలోనే అత్యంత పెద్ద బంగారు గని ఎక్కడుందో తెలుసా.. ఆ బంగారు గనినుంచి ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఎగుమతి అవుతుందనే విషయం తెలుసా..మరి ఇంత పెద్ద గనిలో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుందో తెలుసా.. ఆ విష‌యాల‌ను తెలుసుకుందాం..తాలిబన్ల రాజ్యంలో ‘బ్యాక్ట్రియన్ ఖజానా’.. 2000 ఏళ్లనాటి బంగారు నిధి.. సినిమాను తలపించే స్టోరీలా ఉంటుంది. అది అమెరికాలోని నెవాడా సిటీ. ఈ నెవాడలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద బంగారు గని ఉంది. ఈ గని నుంచే బంగారం ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతుంది.

ఈ నెవాడ గనినుంచి ప్రతీ ఏటా లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి అవతుంది. దాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గనుల నుంచి బంగారం లభ్యమవుతున్నా.. అత్యధిక బంగారాన్ని మాత్రం నెవాడా బంగారం గని నుంచే లభ్యమవుతుంది అంటే అది ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ బంగారం గని సంవత్సరానికి లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతుంది. అంటే ఈ బంగారం గని ద్వారా ఏటా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో ఊహించాలంటే కూడా సాధ్యంకాదు. బహుశా సంఖ్య కూడా సరిపోదేమో..

మ‌న ఇండియాలో గుప్త నిధులు అంటూ అక్ర‌మ త‌వ్వ‌కాలు త‌వ్వుతుంటారు కానీ అక్క‌డ‌క్క‌డా బంగారం గ‌నులు ఉన్నాయి..కేజీఎఫ్ బంగారు గ‌నుల గురించి తెలిసిందే. ఈ గ‌నుల‌పై ఏకంగా సినిమాని కూడా తీశారు. క‌ర్ణాట‌క‌లో ఉన్న ఈ బంగారు గ‌నుల‌కు కొన్ని ఏళ్ళ చ‌రిత్ర ఉంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ‌లో కూడా బంగారం..వ‌జ్రాల లాంటి నిధులు ఉన్నాయ‌ని తెలిసింది. అయితే ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించిన శాస్త్ర వేత్త‌లు..ప‌రిశోధ‌న‌కి అనుమ‌తుల కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం..రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇస్తే ప‌నిని ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మ‌రి ఎప్ప‌టికి స్టార్ట్ చేస్తారో చూడాలి.

ఇక ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రంలో బంగారు గనులు తవ్వకానికి అనుమతులు దక్కించుకుంది ఓ ప్రైవేటు సంస్థ.‌ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు సిద్ధం అవుతుంది ఇండో ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్స్ లిమిటెడ్ . బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించిన సంస్థ.. దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధన సాగించింది. జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఎక్కవగా ఉన్నట్లు గుర్తించింది. 2005లోనే ఈప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం ఆసంస్ధ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మైనింగ్ లీజులు, పర్యావరణ అనుమతుల కోసం తీవ్రమైన జాప్యం చేసుకోవటంతో ప్రాజెక్టు అనుమతులు ఆలస్యమయ్యాయి. ఇలా అనేక చోట్ల బంగారు గ‌నులు ఉన్నా నెవాడానే పైచేయిలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement