Tuesday, April 30, 2024

తెలంగాణలో వచ్చేది హంగే.. కోమటిరెడ్డి జోస్యం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ముమ్మాటికీ హంగ్ ప్రభుత్వమేనని టీ-కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఈ సారి ఏ పార్టీకి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్తో కలవక తప్పదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీలు అని.. ఈ సారి ఆ రెండు పార్టీలకు 60 సీట్లు రావని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వచ్చేది హంగ్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తైనా.. పాతైనా సరే.. కానీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోరాడుతామని.. ఎన్నికల తర్వాత మాత్రం పొత్తులు తప్పవని కోమటిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రావని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక, మార్చి 1వ తేదీ నుండి రాష్ట్రంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement