Tuesday, May 14, 2024

విద్యార్థిపై విచ‌క్ష‌ణ‌ ర‌హితంగా వీధి కుక్కల‌ దాడి- సీసీ కెమెరాలో రికార్డ‌యిన దృశ్యాలు

సైకిల్ పై వ‌స్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆక‌స్మికంగా దాడి చేసింది. అంతేనా విచక్షణ‌ రహితంగా చేతులు, కాళ్లపై కొరికింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు.ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లోని కోజికోడ్ జిల్లా అర‌క్కినార్ లో చోటు చేసుకుంది. కాగా బాలుడిపై కక్ష కట్టిందా అనే రేంజ్ లో కుక్క దాడి చేసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డయింది. ఈ రికార్డ్ ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చింది. కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధికుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆ విద్యార్థులు ఇద్దరు వెంటనే పరుగెత్తుకుని వచ్చి ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజనులు స్పందిస్తూ కేరళను డాగ్స్ ఓన్ కంట్రీ అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement