Sunday, May 5, 2024

మానవ మృగాలు.. యువతిపై నలుగురు లైంగిక దాడి, మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

మహబూబాబాద్‌ క్రైం, ప్రభన్యూస్‌: కామాందుల దాడికి ఓ యువతి బలైంది. మానవ మృగాలు చేసిన లైంగికదాడికి తట్టుకోలేక ఆ యువతి సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో చికిత్స పొందుతూ మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో మృతిచెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజలు అవాక్కయ్యారు. పోలీసుల విచారణలో జాప్యం జరగడం కూడా అందుకు కారణమనే విద్యార్ధి సంఘాలు, కాంగ్రెస్‌, బిజెపిలు వర్గాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన శ్రీరాం సుప్రియ ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆనలుగురు వ్యక్తుల పేర్లను కూడా ఆ నోట్‌లో రాసిందని పోలీసులు చెపుతున్నారు. గ్రామనికి చెందిన నలుగురులో ఓ ప్రజా ప్రతినిథి భర్త, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఆటో డ్రైవర్‌, పూలవ్యాపారి ఉన్నట్లుగా వారు చెపుతున్నారు.

ఈనెల 18న జరిగిన సంఘటన 23వ తేదీ రాత్రి వరకూ బయటకు తెలియపోవడం విచారణలో వైఫల్యమే కారణం. ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం ఆసుపత్రి వర్గాల నుంచి పోలీసులకు చేరకపోవడం, గ్రామం నుంచి కూడా పోలీసులకు తెలియకపోవడం ఈ వైఫల్యానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత బుధవారం మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో సుప్రియ మృతిచెందిందని వార్త తెలియడంలో ఆసుపత్రి పోలీసు పహారాలో నిండిపోయింది. విషయం తెలిసిన రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హుటాహుటీన మహబూ బాబాద్‌ ఏరియా ఆసుపత్రికి వచ్చి సుప్రియ మృతదేహం పరిశీలించి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితులకు శిక్షపడేలా ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.


అత్యాచార నిందితులపై కఠిన చర్యలు: మంత్రి ఎర్రబెల్లి
నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో అత్యాచారాని గురై ఆత్మహత్య చేసుకున్న సుప్రియ మృతదేహాన్ని మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌ ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సుప్రియపై అత్యాచారం జరిందని తేలిందని, ఆమె రాసిన సూసైడ్‌నోట్‌ను కూడా పోలీసులు పరిశీలించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం చేయాలి: గిరిజనమోర్చ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్‌నాయక్‌
మహబూబాబాద్‌ జిల్లాలో అత్యాచారం జరిగి ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు సుప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రి ముందు బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న హుస్సేన్‌నాయక్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి వ్యాన్‌లో ఎక్కించారు. ఈ సందర్భంగా హుస్సేన్‌నాయక్‌ మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులకు శిక్షపడేవరకూ పోరాటం ఆపేది లేదని సుప్రియ కుటుంబానికి బిజెపి అండగా ఉంటుందని హుస్సేన్‌నాయక్‌ బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్‌రావు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

23న పిర్యాదు స్వీకరించాం: ఎస్‌పి శరత్‌చంద్ర పవార్‌
ఫిబ్రవరి 23 సాయంత్రం 4గంటలకు నెల్లికుదురు పోలీస్టేషన్‌లో ఒక పిర్యాదు స్వీకరించినట్లు పిర్యాదులో పలు విషయాలు వెల్లడైనట్లు ఎస్‌పి విలేకర్లకు తెలిపారు. మృతురాలు సుప్రియ ఆమె స్నేహితురాలైన స్వప్న ఇంటికి ఈనెల 16న రాత్రి పడుకోవడానికి వెళ్లి మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చిందని, తిరిగి 17న రాత్రి 8.15 గంటలకు మృతురాలు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్లఙ తెల్లవారుజామున 2.30గంటలకే తిరిగఇ వచ్చినట్లు ఎస్‌పి తెలిపారు. 18న ఉదయం 8గంటల సమయంలో సుప్రియ పురుగుమందు త్రాగినట్లు ఆ సమయంలో ఆమె అన్న చూసి వెంటనే మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పోందుతూ ఆమె 22 రాత్రి 10గంటలకు మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలిపై 17, 18 తేదీల్లో రాత్రి వేళలో నలుగురు వ్యక్తుల చేత లైంగిక దాడి జరడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని, పిర్యాదు ప్రకారం నెల్లికుదురు పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఇప్పటికే పోలీసులు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ,నాలుగవ వ్యక్తికోసం గాలిస్తున్నట్లు ఎస్‌పి శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement