Sunday, May 5, 2024

హైకోర్టు ప్రాంగ‌ణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్..మొక్క‌లు నాటిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

తెలంగాణ‌లో మ‌హోద్య‌మంలా ప్రారంభ‌మైంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఎంపీ సంతోష్ కుమార్ అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మై దేశ విదేశాల‌కి వ్యాపిస్తోంది. కాగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతోష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్, అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను సిజే సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చినట్టు గుర్తు చేసారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జిజిఖానా ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణములో లో సిజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైకోర్టు ప్రాంగణములో మొక్కలు నాటడం పట్ల న్యాయమూర్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొదటగా సిజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయమూర్తి కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు..ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి,జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ జి.శ్రీదేవి,జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు,జీపీలు జోగినిపల్లి సాయి కృష్ణ,సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు ,స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్,ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement