Saturday, May 11, 2024

గ్యాస్ ట్యాంక‌ర్ అనేవారు – కావాల‌నే బ‌రువు త‌గ్గా – రాశీఖ‌న్నా

మూవీస్ చేసే తొలినాళ్ళ‌ల్లో త‌న‌ని గ్యాస్ ట్యాంక‌ర్ అనేవార‌ని ..వార‌న్నార‌ని బ‌రువు త‌గ్గ‌లేద‌ని త‌న‌కు తానుగా బ‌రువు త‌గ్గాన‌న్నారు హీరోయిన్ రాశీఖ‌న్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ తొలి నాళ్ళలో ఆమె ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి వివరించింది. దక్షిణాదిలో తాను హీరోయిన్ గా పరిచయం అయిన తొలి నాళ్లతో తనను బాడీ షేమింగ్ చేశారని ఆమె తెలిపింది. తనను గ్యాస్ ట్యాంకర్ వంటి పదాలతో కామెంట్ చేసేవారని చెప్పింది. తాను కొంచెం బొద్దుగా ఉండటం వల్ల అలా అనేవారని.. తాను ఏమీ అనకపోయేదాన్నని తెలిపింది. హీరోయిన్ గా కొనసాగాలంటే సన్నగా ఉండాలని తెలుసుకున్నాక… తాను బరువు తగ్గానని చెప్పింది. తనకు తానుగా బరువు తగ్గానని… ఎవరో అన్నారని తాను సన్నబడలేదని తెలిపింది. తనకు పీసీఓడీ సమస్య ఉందనే విషయం కూడా తెలుసుకోకుండానే కామెంట్లు చేసేవారని చెప్పింది. తొలి రోజుల్లో బాధగా అనిపించినప్పటికీ ఆ తర్వాత లైట్ గా తీసుకున్నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement