Monday, April 29, 2024

ఎఫ్3లో ఐటెంసాంగ్ – పూజాహెగ్డే ఫిక్స్

ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం చిత్రంలో ఐటెంసాంగ్ లో మెరిసింది హీరోయిన్ పూజాహెగ్డే. ఇప్పుడు మ‌రోసారి ఐటెం సాంగ్ లో రెచ్చిపోనుంది. ‘ఎఫ్‌-3’లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో పూజా న‌ర్తించ‌బోతున్న‌ట్లు గ‌త వారం రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో పూజాహెగ్డే ‘ఎఫ్‌-3’ స్పెష‌ల్ సాంగ్ షూట్‌లో జాయిన్ అయిన‌ట్లు మేక‌ర్స్ పూజా ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 2019లో వచ్చిన ‘ఎఫ్‌-2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ తెర‌కెక్కింది. శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement