Sunday, May 5, 2024

నా ఆరోగ్యం బాగానే ఉంది..అంద‌రికీ ధ‌న్య‌వాదాలు – హీరో విక్ర‌మ్

ఈ మ‌ధ్య కాలంలో ఏ కాస్త చిన్న వార్త‌నైనా పెద్ద ఇష్యూగా చేసి చూపిస్తోంది మీడియా. అదే సెల‌బ్రిటీల విష‌యంలో అయితే మ‌రీను..నిన్న తమిళ సూపర్ స్టార్ విక్రమ్ అస్వ‌స్థ‌త‌కి గుర‌వ్వ‌గా..ఆయ‌న కండిష‌న్ క్రిటికల్ గా ఉంద‌ని..ఆయ‌న‌కి గుండెపోటు వ‌చ్చింద‌ని వార్త‌లు హోరెత్తించారు. దాంతో త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని.. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు విక్ర‌మ్.ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో హీరో విక్రమ్ మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, అందరి ప్రేమ .. ఆప్యాయతలకు తాను కృత‌జ్ఞ‌తుడిని అని చెప్పారు. తనతో కలిసి ఉన్నందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://www.youtube.com/watch?v=6hOELzhxxjM&t=20s
Advertisement

తాజా వార్తలు

Advertisement