Monday, May 20, 2024

‘అల్లూరి’గా రానున్న – హీరో శ్రీవిష్ణు

హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం అల్లూరి. ఈ చిత్రాన్ని ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. కాగా
బెక్కెం వేణుగోపాల్ – బబిత నిర్మిస్తున్నారు. ‘అల్లూరి’ టైటిల్ ను ఖరారు చేసి, ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ అల్లుకున్న కథ. ఆ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. ఇంతవరకూ తను చేస్తూ వచ్చిన సినిమాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. బ్రోచేవారెవరురా’ తరువాత శ్రీ విష్ణు ఇక దూకుడు చూపిస్తాడని అనుకుంటే, ‘తిప్పరా మీసం’ .. ‘గాలి సంపత్’ సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ‘రాజ రాజ చోర’ ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ,’ ‘అర్జున ఫల్గుణ’ దెబ్బకొట్టేసింది. త్వరలో ‘భళా తందనాన’తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement