Wednesday, May 1, 2024

నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన ర‌వితేజ – టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు షూట్ స్టార్ట్

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నాడు. ఆయ‌న వ‌రుస‌గా నాలుగు సినిమాల‌ను లైన్ లో పెట్టారు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తికాగా ‘ధ‌మాకా’ ఇటీవ‌లే నాలుగ‌వ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా ‘రావ‌ణాసుర’ కూడా ఇటీవ‌లే షూటింగ్ మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో తాజాగా ర‌వితేజ న‌టిస్తున్న మ‌రో సినిమా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ షూటింగ్ తాజాగా ప్రారంభ‌మైంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా పూజా కార్య‌క్రమాలు జ‌రిగాయి. ఈ చిత్రం ఇండియ‌న్ రాబిన్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నుంది. 70,80 ద‌శ‌కాల్లో నాగేశ్వ‌ర‌రావు ఆంధ్ర ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు, దోపిడీలు చేస్తూ పోలీసుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకునే వాడు. ఇలాంటి గ‌జ‌దొంగ కథ బ‌యోపిక్‌గా తెర‌కెక్క‌నుంది అని తెలియ‌డంతో ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రానికి వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడిగా నుపూర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌రద్వాజ్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement