Tuesday, April 16, 2024

త్వ‌ర‌గా పిల్ల‌ల్ని క‌నండి..సంతోషంగా ఉండండి – సంజ‌య్ ద‌త్

బాలీవుడ్ న‌టులు ..ప్రేమ జంట ఆలియాభ‌ట్, ర‌ణ‌బీర్ క‌పూర్ ల పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డింది. కాగా ఆలియా, ర‌ణ‌బీర్ ల‌కి బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సంజ‌య్ ద‌త్త్ విషెష్ తెలిపారు. రణబీర్, అలియా భట్ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు కొద్ది మంది తప్పించి ఇతరులకు ఆహ్వానం లేదని స‌మాచారం. వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సంజయ్ ద‌త్త్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. రిసెప్షన్ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.కాగా రణబీర్,ఆలియా వివాహంపై ..సంజయ్ దత్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘రణబీర్ కపూర్ పెళ్లి చేసుకునేట్టు అయితే నిజంగా నాకు సంతోషమే. అలియా నా ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. వివాహం అన్నది ఒకరి పట్ల మరొకరు నిబద్ధత కలిగి ఉండడం, కొంత రాజీ పడడం. దానికి వారు కట్టుబడి ఉండాలి. ఒకరి చేయి మరొకరు పట్టుకుని సంతోషం, శాంతి, కీర్తితో జీవితంలో ముందుకు సాగిపోవాలి. రణబీర్ త్వరగా పిల్లల్ని కనండి. సంతోషంగా ఉండు’’అని సంజయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement