Friday, May 17, 2024

కోతుల ఆహార క్షేత్రం

నల్లబెల్లి : కోతుల ఆహార క్షేత్రం ప్రక్కన వచ్చే వానాకాలం నాటికి నీటి వసతి కోసం ఈ పాండ్ నిర్మాణం చేస్తున్నామని ఎంపీవో కూచన ప్రకాష్ తెలిపారు. మండలంలోని బుచ్చి రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న పాండ్ ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాండ్ నిర్మాణం కోసం జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ధి స్వప్న, బుచ్చిరెడ్డి పల్లి గ్రామ పంచాయితీ నిధులతో ఇది చేపట్టడం జరిగిందని ఎంపీవో తెలిపారు. గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోతుల ఆహార క్షేత్రంలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటాలని తెలపడంతో బుచ్చి రెడ్డి పల్లి గ్రామంలోని 840 పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇప్పుడు రామ ఫలము, సీత పలము, మామిడి కాయలు కాస్తున్నాయ్ అని తెలిపారు. మండలంలోని మొత్తం.11పాండ్ లను ఏర్పాటు చేశామని ఎంపీవో తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లూనావత్ వెంకన్న, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement