Saturday, May 4, 2024

రామ్ చ‌ర‌ణ్ న్యూ మూవీ – లీక్ అయిన ఫొటో

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ మూవీ చేయ‌నున్నాడు. కాగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ తాజాగా లీకైంది. గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడత‌పెట్టి.. సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫొటో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అది శంకర్ సినిమాలోనిదేనని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు షేడ్స్ లో నటించనున్నట్టు టాక్. 1980ల నాటి రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. దానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ కథకు సంబంధించిన ఫొటోనే ఇదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement