Saturday, April 27, 2024

మేజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – ట్వీట్ చేసిన చిత్ర యూనిట్

మేజ‌ర్ చిత్రం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో హీరో అడ‌విశేషు న‌టిస్తున్నాడు. 26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండాపోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతోంది. తాజాగా మేజర్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. మే 27వ తేదీన థియేటర్లలో విడుదల చేసినట్టు తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. కాగా ఫిబ్రవరి 11వ తేదీన మేజర్ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని మొదట చిత్రబృందం అనుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement