Tuesday, May 7, 2024

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్ కాలిమండీర్ సన్ సిటీ బంజరాహిల్స్ గచ్చిబౌలి ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షం కారణంగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement