Tuesday, May 7, 2024

Something Special: కొట్లు పోసినా దక్కని సుఖం.. ఆహా ఏమి ఈ ఆనందం!

కొన్ని ఫొటోలు చూస్తుంటే అట్లానే చూడాలనిపిస్తుంటుంది. అందులో ప్రకృతికి సంబంధించిన విషయాలైతే ఇంకా మైమరచిపోతుంటారు చాలామంది. అదేవిధంగా చిన్నారులను కూడా అంతే ముచ్చటపడి చూస్తుంటారు. ఇక.. కొన్ని విషయాల్లో వీటన్నిటిని మించిన సంతోషం ఉంటుంది. అదే అన్నదాత రైతు.. అందరూ రైతు బాగుపడాలే, రైతు రాజ్యం కావాలే అని ముచ్చట్లు చెబుతరు కానీ, చేతల్లో చూపించరు.. మరి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫొటో చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్​ రూపంలో తెలియజేయండి..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

నెట్​వర్క్​ రాలేదన్న టెన్షన్​ లేదు.

నెట్​ బ్యాలెన్స్​ అయిపోయందనే గోల లేదు

బీపీ, షుగర్​ వంటి రోగాలు లేవు

- Advertisement -

ఈఎంఐలు కట్టాలనే టెన్షన్​ లేదు, అప్పులోళ్ల లొల్లి అస్సలే లేదు

నెల జీతం కోసం వెయిటింగ్​ లేదు

రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు

కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు

కోటల్లో ఉండాలన్న కోరికా లేదు

కార్లలో తిరగాలన్న ఆకాంక్ష లేదు

ప్లాట్లు, భూములు కొనాలన్న ధ్యాస లేదు

పిజ్జాలు బర్గర్లు తినాలనే ఊసు లేదు

ఆరోగ్యం కోసం డైటింగ్​ చేసే పని లేదు

ప్రకృతే నేస్తం.. పచ్చగడ్డే పరుపు

నేలతల్లే డబుల్​ కాట్​ బెడ్​

పచ్చడి మెతుకులే పరమాన్నం

తుండు గుడ్డే పట్టు వస్త్రం

చినుకు పడితే ఆనందం

పంట చేతికొస్తే పరమానందం

తాను సృష్టించుకున్న సామ్రాజ్యానికి..

తానే రాజు, తానే మంత్రి, తానే సైన్యం

జై కిసాన్​.. జై హింద్​!

Advertisement

తాజా వార్తలు

Advertisement