Sunday, April 28, 2024

TS: నేటి నుంచి ఒంటిపూట బడులు..

తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. విద్యార్థులకు 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. టెన్ ఎగ్జామ్స్ మే 20 వరకు జరగనున్నందున అదే ఈ విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే కానుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూ ళ్లకు ఈ నిర్ణయం వర్తించనుంది.

కాగా, రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్న నేప‌థ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తొలుత ఈ నెల 16 నుంచి ఒంటి పూట బ‌డులంటూ గ‌తం ప్ర‌కటించిన ప్ర‌భుత్వం..తాజాగా నేటి నుంచే (మార్చి 15) ఒంటి పూట బ‌డుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లుగా తెలిపింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కురాలు శ్రీ దేవ సేన సోమవారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement