Saturday, May 11, 2024

నేడు వైఎస్సార్‌సీఎల్పీ భేటీ.. భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. కొంత మంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం చెప్పారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని.. కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. పార్టీని గెలిపించుకుని వస్తే మళ్లీ మంత్రులు కావొచ్చని చెప్పినట్ ప్రచారం జరుగోతంది. ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తే ప్రాంతం, కులాల ఆధారంగా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. సీఎం జగన్ కేబినెట్ విస్తరణపై వ్యాఖ్యలతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరని కొనసాగిస్తారు.. ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే జగన్ ప్రకటనతో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు మొదలయ్యాయి.  ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీఎల్పీ సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే రెండేళ్లలో ఏం చేయాలో, ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లాలో త్వరలోనే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలని సీఎం సూచించినట్లు సమాచారం.  

Advertisement

తాజా వార్తలు

Advertisement