Sunday, May 5, 2024

హిందీభాష‌పై పెరుగుతోన్న వ్య‌తిరేక‌త‌-ఈ నెల 15న త‌మిళ‌నాడు అంత‌టా డీఎంకే నిర‌స‌న‌లు

హిందీభాష త‌ప్ప‌నిస‌రి అన‌డంపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా అన్ని సాంకేతిక, సాంకేతికేతర, వైద్య యూనివర్సిటీల్లో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ సిఫార‌సుకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరస‌న‌లు వెల్లువెత్తున్నాయి. అధికార డీఎంకే యువజన, విద్యార్థి విభాగం రాష్ట్రవ్యాప్త నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్, విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎజిలరసన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న హిందీ విధింపు విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామ‌ని ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 15న తమిళనాడు అంతటా నిరసనలకు డీఎంకే ప్లాన్ చేస్తుంది.పార్లమెంటరీ కమిటీ నివేదికను గతంలో సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement