Thursday, April 25, 2024

సహస్రకవచుడు-కర్ణుడు

పూర్వకాలంలో ఒక రాక్షసు డు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలను వరంగా పొందాడు. అప్పటినుంచి ఆ రాక్షసుడుకి ‘సహ స్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపో యింది. ఆ వరగర్వంతో సర్వలోకా లనూ నానా హంసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధ లు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి.. నేను నర- నారా యణ రూపాలలో బదరికావనం లో తపస్సు చేస్తున్నాను. వాడికి అం త్యకాలం సమీపించినప్పుడు.. వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.
హరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండు రూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించారు. వారే నర- నారా యణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహంచారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగు తోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర- నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి. ‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమిటి? వీరెవరో కపట తాపసులై యుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధా నికి ఆహ్వానించాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఎంత కాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహా విష్ణువును ధ్యానించాడు.
శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మిం చినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర- నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నర- నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రు డు భయపడి… వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, నృత్య, గానాలతో నర, నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ, ఫలితం శూన్యం.
అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయ డంలేదు అని మా మాటగా మహంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడ మీద చేత్తో చరుచుకున్నాడు.
ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల (తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వశి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు.
మహంద్రుడు తన తప్పు తెలుసుకుని నర-నారాయణులను క్షమించ మని వేడుకున్నాడు. నర- నారాయణుల తపస్సు కొనసాగుతోంది. ఆ సమ యంలో వరగ ర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారి దగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు.
అప్పుడు నారాయణుడు అతనితో ”రాక్షసేశ్వరా.. నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే.. మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను” అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగు తోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచు నితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు.
ఇలా నర- నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రక వచునికి ఉన్నది ఒకే ఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్ధ రంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభ యం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభ యం ఇవ్వ లేను. నర- నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. స#హస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు.
కర్ణుడు పుట్టుక
దూర్వాస మహర్షి కుంతికి ‘సంతాన సాఫల్య మంత్రం’ ఇస్తాడు. ”ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహంచరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది.” అని చెబుతాడు దూర్వాస మహర్షి.
కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించాలని తలచి, ఆ మంత్రంతో సూర్యభగ వానుని ఆవాహన చేస్తుంది. సూర్యుడు కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన తన దగ్గరున్న ఆ సహస్రకవచుడినే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించా డు. ఆ కర్ణుని సంహరించడానికే నర- నారాయణులిరువురూ.. కృష్ణార్జును లుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సం#హరించారు.

– డా|| చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement