Saturday, April 27, 2024

కన్నడ భాషకు గూగుల్ లో అవమానం..

ఇండియాలో అత్యంత వికారమైన భాష ఏది అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూసిప్తోంది. దీనిపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం తమ భాషపైనే కాదని, తమపై తమ అస్థిత్వంపై జరుగుతున్న దాడి అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం కన్నడిగులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల, భాషాల వారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది. దీనిపై పొలిటికల్ లీడర్స్ కూడా స్పందించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని అన్నారు. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కుడా ఒకటని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement