Thursday, March 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 1
ఓం శ్రీ పరమాత్మనే నమ:

అథ షోడశోధ్యాయ:
దైవాసురసంపద్విభాగయోగ:

1.
శ్రీభగవాన్‌ ఉవాచ
అభయం సత్త్వసంశుద్ధి:
జ్ఞానయోగవ్యవస్థితి: |
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌ ||

తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : ఓ భరతవంశీయుడా! భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము అనునవి దివ్య లక్షణములు.

భాష్యము : వర్ణాశ్రమ ధర్మాల లక్ష్యము సమాజాన్ని సంపదలతో శాంతి సామరస్యాలతో ఉండేట ట్లు చూచుట. చతుర్‌ వర్ణాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్ర మరియు చతుర్‌ ఆశ్రమాలు అనగా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థి, సన్యాసి అనేవి వ్యక్తి యొక్క అర్హతలు, లక్షణాలను బట్టి గాని జ న్మ ప్రకారము కావు. ఇక్కడ శ్రీ కృష్ణ భగవానుడు వేరు వేరు ఆశ్రమాలలో ఉండువారు పెంపొందించుకొనవలసిన లక్షణాలను తెలియజేయుచున్నాడు.

- Advertisement -

సన్యాసి :- పరమాత్మ రూపములో భగవంతుడు తనను రక్షిస్తాడని, పోషిస్తాడనే విశ్వాసము కలిగి ఉండాలి. స్త్రీ సాంగత్యమును విడనాడవలెను. జ్ఞానమును పంచవలెను. అంతేకాక అభయమును, పవిత్రతను మరియు జ్ఞానమును కలిగి ఉండవలెను.

వానప్రస్థ :- మనసా కర్మణా వాచా తపస్సును ఆచరించవలెను.

గృహస్థ :- శాస్త్రములలో తెలిపినట్లు దానము చేయుట. భగవంతుని సేవకై పిల్లలను కనుట. సంకీర్తన యజ్ఞమును నిర్వహించుట.

బ్రహ్మచారి : స్త్రీ సాంగత్యమునకు దూరముగా ఉంటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ, శాస్త్రమును అధ్యయనము చేసి జ్ఞానమును పొందుటలో మనస్సను లగ్నము చేయుట.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement