Monday, April 29, 2024

Telangana: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. గ్రూప్ 2, 3 ఉద్యోగాల‌కు నోటిఫికేన్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్​ న్యూస్ ​చెప్పింది. ఇప్పటికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ల‌తో పాటు ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌రించిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు నిరుద్యోగుల‌కు మ‌రో తీపి క‌బురు తీసుకొచ్చారు. తాజాగా మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నుంచి ఇవ్వాల (మంగ‌ళ‌వారం) అనుమ‌తి వ‌చ్చింది. గ్రూప్ -2 ఉద్యోగాలు 663, గ్రూప్-3 ఉద్యోగాలు 1,373, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 294, గిడ్డంగుల సంస్థ‌లో 50 పోస్టులు, విత్త‌న ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లో 25 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు మంత్రి హ‌రీశ్‌రావు దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement