Sunday, May 19, 2024

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది. ప‌సిడి ప్రేమికుల‌కు ఇది బ్యాడ్ న్యూస్..బంగారం ధర ఒక్క రోజులోనే రూ.1000కి పైగా పైకి కదిలింది. ఇక వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు ఏకంగా రూ.2 వేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం వెండి కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 పెరిగింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 53,890కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ. 1000 పెరుగుదలతో రూ. 49,400కు చేరింది. బంగారం ధరలు ర్యాలీ చేస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.2,300 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 75,700కు చేరింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. ఔన్స్‌కు 0.03 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 2002 డాలర్లకు చేరింది. బంగారం పెరిగితే వెండి కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 25.85 డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement