Monday, November 11, 2024

ఈ వారంలో బంగారం ధ‌ర‌లు

గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.6 శాతం క్షీణించింది. 10 గ్రాములకు రూ. 50,984 వద్ద క్లోజ్ అయ్యింది. పసిడి రేటు తగ్గినా కూడా మే నెల నాటి కనిష్ట స్థాయి రూ. 49,700 నుంచి చూస్తే బంగారం ధర ఇంకా రూ. 1000 పైనే కదలాడుతున్నాయి. అమెరికా జాబ్ గణాంకాలు అంచనాల కన్నా మెరుగ్గా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. జాబ్ డేటా నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల బంగారం ధరలపై ప్రభావం పడింది. అలాగే అమెరికా డాలర్ కూడా బలపడింది. దీంతో స్పాట్ గోల్డ్ 1 శాతం పడిపోయింది. ఔన్స్‌కు 1848 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.కాగా హైదరాబాద్‌లో ఈ వారంలో బంగారం ధరలు స్వల్పంగా పైకి కదిలాయని చెప్పుకోవాలి. మే 30 సోమవారం రోజున బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,200 వద్ద ఉండేది. వారం చివరకు వచ్చేసరికి పసిడి రేటు రూ. 52,470 వద్ద ఉంది. అంటే పసిడి రేటు దాదాపు రూ. 270 మేర పైకి కదిలిందని చెప్పుకోవచ్చు. ఇది 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 47,850 నుంచి రూ. 48,100కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement