Tuesday, May 7, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు- త‌గ్గిన వెండి

గ‌త శుక్ర‌వారం నుండి బంగారం ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఆదివారం కూడా బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.48 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 ఎగిసి రూ.52,340గా రికార్డయింది. మొత్తంగా ఈ మూడు రోజుల నుంచి బంగారం ధర రూ.1620 మేర పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. బంగారం ధర పెరిగిన ఈ సమయంలో వెండి రేటు భారీగా పతనమైంది. కేజీ వెండిపై రూ.1,500 మేర ధర దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.63,500గా నమోదైంది. అటు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.250 పెరిగి రూ.48,100గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 200 పెరిగి రూ.52,400కు ఎగిసింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర రూ.1200 మేర పతనమై కేజీ రూ.57,800గా పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement