Saturday, April 27, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగురాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది చెదువార్త‌. పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చారు. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. కొత్త ఏడాది వరుసగా రెండవరోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల కన్పిస్తోంది. ఈ రోజు పసిడి రూ. 140 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 450గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49, 590కి చేరింది. కిలో వెండి ధర రూ.66,600గా వద్ద కొనసాగుతోంది.

విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,590కి ఎగసింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,600 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,930 కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,700గా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,150 కి చేరింది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

- Advertisement -

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45, 590గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49, 730గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 850గా నమోదైంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement