Saturday, May 4, 2024

ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి – హీరో ఆఫ్ ఉక్రెయిన్ బిరుదు ఇచ్చిన ప్ర‌భుత్వం

ఉక్రెయిన్ పై ర‌ష్యా వార్ కొన‌సాగుతూనే ఉంది. కాగా రష్యా సైనికుల‌కు చుక్క‌లు చూపించిన పైట‌ర్ పైల‌ట్ మేజ‌ర్ స్టిఫాన్ తార‌బ‌ల్కా మర‌ణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 40 రష్యా యుద్ధ విమానాలను ఆయన నేలకూల్చారు. శత్రువులకు చిక్కకుండా తన ఫైటర్ జెట్ ను నడిపిస్తూ, శత్రువుల యుద్ధ విమానాలను కూలుస్తూ, పుతిన్ సేనలకు ఆయన ముచ్చెమటలు పట్టించారు. ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరుగాంచారు. గత నెలలో ఆయన చనిపోయారని ‘టైమ్స్ ఆఫ్ లండన్’ ప్రకటించింది. 29 ఏళ్ల స్టెఫాన్ ను యుద్ధ వీరుడిగా కీర్తించింది. ఆయన ఒక బిడ్డకు తండ్రి అని తెలిపింది. మిగ్-29లో దూసుకెళ్తూ శత్రువులపై విరుచుకుపడుతున్న స్టెఫాన్ విమానాన్ని మార్చి 13న రష్యా బలగాలు కూల్చేశాయని టైమ్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందారని తెలిపింది. దేశం కోసం ఆయన చేసిన సేవలకు గాను ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయనను ‘హీరో ఆఫ్ ఉక్రెయిన్’ అనే బిరుదు ఇచ్చిందని పేర్కొంది. యుద్ధానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్’తో గౌరవించిందని… ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారని తెలిపింది. టైమ్స్ ఆఫ్ లండన్ కథనం ప్రకారం స్టెఫాన్ కు చెందిన హెల్మెట్, గాగుల్స్ ను లండన్ లో వేలం వేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement