Tuesday, May 14, 2024

ఘ‌రానామొగుడు@30ఇయ‌ర్స్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఘ‌రానా మొగుడు చిత్రం విడుద‌లై 30సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. . గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత వచ్చిన ఈ మూవీ ఆ రెండు చిత్రాల‌ని మించిన విజయం సాధించి మెగా అభిమానులు ఆనందపడేలా చేసింది. కాగా చిరంజీవికి ఇది 75వ చిత్రం కాగా, ఇది రీమేక్ ఫిల్మ్ కావడం గమనార్హం. తమిళ్ డైరెక్టర్ పి.వాసు స్టోరిని తెలుగు నేటివిటీకి తగ్గట్లు పరుచూరి బ్రదర్స్ మార్చి అందించగా, ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ పిక్చర్ ఘన విజయం సాధించింది. చిరు-రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఘరానా మొగుడు’ గురించి సినీ అభిమానులందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీసు వద్ద రికార్డుల ఊచకోత కోసిన ఈ పిక్చర్..మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయింది.

కాగా చిరంజీవికి ఇది 75వ చిత్రం..అయితే ఇది రీమేక్ ఫిల్మ్ కావడం గమనార్హం. తమిళ్ డైరెక్టర్ పి.వాసు స్టోరిని తెలుగు నేటివిటీకి తగ్గట్లు పరుచూరి బ్రదర్స్ మార్చి అందించగా, ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ పిక్చర్ ఘన విజయం సాధించింది. ఈ పిక్చర్ లో హీరోయిన్స్ గా నగ్మా, వాణి విశ్వనాథ్ నటించారు. నగ్మా-చిరంజీవిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో ‘బంగారు కోడి పెట్ట’ సాంగ్ బాస్ చిరును.. డ్యాన్స్ గురువుగా మార్చేసింది. తనలోని గ్రేస్ ప్లస్ డ్యాన్స్ మూమెంట్స్ చూపి జనాలను ఉర్రూతలూగించారు చిరంజీవి. ఈ పాటను రామ్ చరణ్ ‘మగధీర’లో రీమేక్ చేయడం విశేషం. ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలు, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ చిత్ర వంద రోజుల సంబురాలు చేశారు మేకర్స్. దేవీ వర ప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. కార్మిక సంఘ నాయకుడిగా, ఫ్యాక్టరీ ఓనర్ అల్లుడిగా చిరంజీవి నటనకు జనాలు ఫిదా అయిపోయారు. రావు గోపాలరావు, కైకాల సత్యనారయణ, బ్రహ్మానందం, రమ ప్రభ, ఆహుతి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement