Saturday, April 27, 2024

కాంగ్రెస్ ప‌రిస్థితిపై నేడు జీ 23 నేత‌ల స‌మావేశం

జీ 23 నేత‌లు ఈరోజు స‌మావేశం కానున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన‌ నేపథ్యంలో జీ 23 నేతల సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అసంతృప్త నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తున్నామని, దీనికి నాయకత్వ లోపమే కారణమని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా పార్టీ అధ్యక్షుడిని నియమించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. ఏఐసీసీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈరోజు సమావేశమయ్యే జీ 23 నేతలు సోనియా గాంధీకి ఘాటుగానే లేఖ రాయాలని నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత పార్టీ అధ్య‌క్షుడిగా ఎవ్వరినీ నియమించలేదు. రాహుల్, ప్రియాంక గాంధీలే ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఓటమికి బాధ్యులెవరో తేల్చాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement