Thursday, May 9, 2024

Big Story | తెలంగాణ‌కు జలకళ.. మత్తడి దుంకుతున్న 18,490 చెరువులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. గోదావరితీరప్రాంతాల్లో ఎగువ పెన్‌ గంగా నుంచి వరదలకు గోదావరి ఉపనదులు తోడై జలాశయాలతో పాటుగా చెరువులు నిండాయి. అయితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువనుంచి వరదలు లేకపోయినప్పటికీ కృష్ణా నది ఉపనుదులైన బీమా, డిండీ, మూసీ, హాలియా, పాలేరు, మున్నేరు నదుల్లో ప్రవాహాలు గణనీయంగా పెరిగడంతో పాటుగా ఈ పరివాహక ప్రాంతాల్లోని చెరువులు నిండుకుంటలయ్యాయి.

రాష్ట్రంలో 19 మంది చీఫ్‌ ఇంజనీర్ల ఆధీనంలోని 34618 చెరువుల్లో 18490 చెరువులు పూర్తి స్తాయి నీటి మట్టాన్ని దాటి అలుగు పారుతున్నాయి. మిగతా చెరువులు 50 శాతం నుంచి 75 శాతం వరకు నీరు చేరుకోవడంతో స్థానిక చెరువులపై ఆధారాపడిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 34618 చెరువులను 19 మంది ఈఎన్సీల పరిధిలో నిర్వహణ జరుగుతుంది. ఈ చెరువుల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement