Saturday, April 27, 2024

Big Story | ఇక డీజిల్‌ కార్లపై పూర్తి నిషేధం.. కేంద్ర సర్కారు సూచనప్రాయ నిర్ణయం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: నానాటికీ మితిమీరుతున్న వాయు కాలుష్యం.. ఆ ప్రభావంతో సమతుల్యత కోల్పోతున్న వాతావరణం, ఫలితంగా ప్రతియేటా పెరుగుతున్న ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని ఇక డీ.ఇల్‌ కార్లపై పూర్తి నిషేదం విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై గత ఏడాది కాలంగా జరిగిన అధ్యయనం, తదనంతర పరిణామాలతో, నిషేదానికి గల కారణాలు, ఉద్దేశాలతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఉపరితల రవాణాశాఖలు సంయుక్తంగా సంయుక్తంగా నివేదికను సిద్ధం చేశాయి. ఇటీవల ఆ నివేదికను కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీకి సంబంధిత అధికారులు అందజేశారు. త్వరలో జరుగనున్న కేంద్ర మంత్రిమండలి అజెండాలో ప్రధానాంశంగా పొందుపరిచి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. విపత్కర పరిస్థితులు వెంటాడుతూ.. ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో 2027 నాటికి డీజిల్‌ వాహనాలను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రతియేటా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల సంఖ్య పెరుగుతుండడం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తోంది. డీజిల్‌ వాహనాలకు బదులుగా, ప్రజలు ఎలక్ట్రిక్‌, గ్యాస్‌తో నడిచే వాహనాలపై దృష్టి పెట్టాలని, అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు- చేసిన ప్యానెల్‌ ఈ సూచనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. నగరాల జనాభాకు అనుగుణంగా డీజిల్‌ వాహనాలను నిషేధించాలని ప్యానెల్‌ ప్లాన్‌ చేసింది. దీని ప్రకారం ఒక మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ ఆధారిత వాహనాలకు మారాల్సి ఉంటుంది.

కారణమేమిటంటే.. ఇలాంటి నగరాల్లో కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతూనే ఉంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు- చేసిన ప్యానెల్‌ ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే మార్గాలను సిఫార్సు చేస్తోంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన నివేదిక ప్రకారం, గ్రీన్‌హౌస్‌ వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. వందల పేజీల ఈ నివేదికలో భారతదేశ శక్తి పరివర్తన పూర్తి ప్రణాళికను పొందుపరిచారు.

2027 నాటికి దేశంలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంలో లేదా కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో డీజిల్‌ వాహనాలను పూర్తిగా నిషేధించాలని ఈ నివేదికలో సూచించింది. ఇది కాకుండా, 2030 నాటికి, విద్యుత్తుతో నడిచే నగర రవాణాలో ఆ బస్సులను మాత్రమే చేర్చాలి. ప్యాసింజర్‌ కార్లు మరియు టాక్సీ వాహనాలు 50 శాతం పెట్రోల్‌ మరియు 50 శాతం ఎలక్ట్రిక్ర్‌ ఉండాలి. 2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయం ఏడాదికి 10 మిలియన్‌ యూనిట్లను దాటు-తుందని చెబుతున్నారు.

- Advertisement -

దేశంలో ఎలక్ట్రిక్ర్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్ర్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికల్స్‌ స్కీమ్‌ కింద ఇచ్చిన ప్రోత్సాహకాలను పొడిగించాలని, అందుకు ప్రభుత్వం నివేదికలోని అధ్యయన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణుల బృందం కేంద్రానికి సిఫారసు చేసింది. దేశంలోని సుదూర బస్సులను విద్యుదీకరించవలసి ఉంటు-ందనీ, అయితే, ఇప్పుడు రానున్న 10 నుచంఇ 15 సంవత్సరాలకు గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగించవచ్చునని సూచించింది. దీంతో దాదాపు పలు దిగ్గజ కంపెనీలకు చెందిన 25 డీజిల్‌ ఇంజిన్‌ కార్‌ మోడళ్లు అతిత్వరలోనే మనకిక కనిపించకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement