Monday, May 6, 2024

TS | మ‌ర‌ప‌డ‌వ‌ల‌పై ముంపు గ్రామాల్లో ప‌ర్య‌టించిన భ‌ట్టి.. వ‌స‌తులు స‌రిగా లేవ‌న్న బాధితులు

గోదావరి వరదలతో నీట మునిగిన భద్రాచలం డివిజన్ పరిధిలోని సున్నంబట్టి, మాల కాశీ నగర్ గ్రామాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే పొదెం వీరయ్య తో కలిసి మర పడవలు వేసుకొని ఆయా గ్రామాలను పరిశీలించారు. శ‌నివారం రాత్రి ఇరు గ్రామాలకు చెందిన కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు భ‌ట్టికి తెలిపారు. ఇప్పటికీ ఆ గ్రామంలోనే ఉన్న మరికొందరితో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు కాంగ్రెస్ నేత‌లు. పెరుగుతున్న గోదావరి ఉధృతి కారణంగా మిగత వారిని కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సిఎల్పీ నేత భట్టి కోరారు.

తమ పశువులు, వస్తువులు వదిలి రావడం ప్రతి ఏడాది ఇదే ఇబ్బందులు పడుతున్నామని సున్నం బట్టి, మాల కాశీ నగర్ వాసులు వివ‌రించారు. అంతక ముందు తాలవాయి బాడువ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. అక్కడి వసుతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆహారం సమయానికి అందటంలేదని, తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంద‌ని భాదితులు సిఎల్పీ నేతకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement