Saturday, May 4, 2024

ఇండియాలో స్పైడర్ కి ఫుల్ డిమాండ్.. క్రాష్ అయిన వెబ్ సైట్స్…

మార్వెల్స్‌ ఆధ్వర్యంలో తెరకెక్కిన చిత్రం ‘స్పైడర్‌ మెన్ – ‘నో వే హోమ్‌’ సినిమా అంచనాలు భారీగా నెలకొన్నాయి. పిటర్‌ పార్కర్స్‌ తెర కెక్కించిన ఈ మూడవ చిత్రాన్ని ఇండియాలో డిసెంబర్‌ 16న విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ సంస్థ ఇండియాలో ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.

ఈ చిత్రంలో జెండయ, బెనెడిక్ట్‌ కుంబర్‌బ్యాచ్‌, జాకబ్‌ బటలన్‌, జాన్‌ ఫెవర్యూ, మరిస -టొమి ముఖ్య పాత్రలను పోషించారు. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయిన నేపథ్యంలో.. సినిమాకున్న డిమాండ్‌ దృష్ట్యా వెబ్‌ సైట్స్‌ అన్నీ కూడా క్రాష్‌ అయ్యాయి. అలా జరగడంతో అభిమానులు సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement