Monday, May 6, 2024

ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణం

స్థానిక సంస్థల శాస‌న‌మం‌డలి సభ్యు‌లుగా ఇటీ‌వల ఎన్ని‌కైన పోచం‌పల్లి శ్రీని‌వా‌స్‌‌రెడ్డి, టీ భాను‌ప్ర‌సాద్‌, ఎంసీ కోటి‌రెడ్డి, దండే విఠల్‌ సోమ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరి చేత మండ‌లి‌లోని తన చాంబ‌ర్‌లో చైర్మన్‌ ప్రొటెం సయ్యద్‌ అమి‌ను ల్‌హస‌న్‌‌ జాఫ్రీ ప్రమాణం చేయిం‌చారు.

ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా భాను ప్రసాదరావు ఎన్నికైయ్యారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ప్రొటెం ఛైర్మన్ జాప్రీ భాను ప్రసాద్ రావుతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు, అనంతరం  మంత్రులు ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుండి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. శాస‌న మండ‌లిలో ప్రొటెం చైర్మ‌న్ స‌య్య‌ద్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ ఆయ‌న చేత ప‌ద‌వీ ప్ర‌మాణం చేయించారు. రాష్ట్ర‌ మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ త‌దిత‌రుల స‌మ‌క్షంలో చైర్మ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి చేత ప్ర‌మాణం చేయించారు. వీరితోపాటు భాను ప్ర‌సాద్‌, దండే విఠ‌ల్‌, కోటిరెడ్డి లు కూడా ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణం చేశారు. వేర్వేరుగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాల‌కు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్ ఆయా జిల్లాల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

కాగా, పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణం త‌ర్వాత ఆయ‌న‌కు మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ స‌య్య‌ద్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ, రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రోడ్లు భ‌వ‌నాలు, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ‌ల మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ త‌దిత‌రులు అభినందించి, శుభాకాంక్ష‌లు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నిక‌వ‌డంతోపాటు, త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుని, పార్టీకి, ప్ర‌భుత్వానికి మంచి పేరు తేవాల‌ని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement