Friday, May 3, 2024

హైదరాబాద్ వాసులకు త్వరలో మరిన్ని ఫ్లైఓవర్లు

హైదరాబాద్ పరిధిలో అధికారులు చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్లు వేసిన జీహెచ్ఎంసీ.. ఈసారి కూడా పాలసీని అవలంభిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల వేగాన్ని పెంచుతోంది. హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి కొండాపూర్, షేక్ పేట్, బాలానగర్ర, బీరంగూడ మరియు ఓవైసీ జంక్షన్ లలో కొత్తగా ఫ్లైఓవర్లను నిర్మిస్తుండగా.. వీటిలో నాలుగు ఫ్లూఓవర్లు ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.4,741.97కోట్ల వ్యయంతో మౌళిక సదుపాయాల కల్పనకు ముందుకు సాగుతోంది. గడిచిన ఆరేళ్లలో రూ.1,010.77కోట్ల వ్యయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ.. అదే స్పీడుతో మరికొన్ని ప్రాజెక్టులను చేపట్టింది. ‘లాక్ డౌన్ వల్ల రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఎలాంటి రద్దీ ఉండదు కాబట్టి రాత్రిపగలు కష్టపడి పని చేసి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి అవకాశం లభిస్తోంది’ అని అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement