Sunday, April 28, 2024

దగ్గుబాటి హీరో ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కృతిశెట్టి ?

బుచ్చిబాబు సాన దర్శకత్వం వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా అటు దర్శకుడికి హీరో హీరోయిన్ లకు మొదటి చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉండగా కృతి శెట్టి ఓ బడా దర్శకుడి ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదట డైరెక్టర్ తేజ.

ప్రస్తుతం తేజ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా ఓ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకున్నాడట. ఈ మేర ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. కానీ కృతి మాత్రం సున్నితంగా అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి నాని, సుధీర్ బాబు, రామ్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పింది. ఇటువంటి సమయంలో కొత్త హీరోతో సినిమా రిస్క్ గా భావించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement