Saturday, May 4, 2024

మ‌ద్ద‌తుదారుడి చెంప ప‌గ‌ల‌కొట్టిన.. మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌

స‌హ‌నం కోల్పొయారు క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌. ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు అక్కడ భారీగా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు. దాంతో పోలీసులు, బాడీగార్డులు అందరినీ పక్కకు నెడుతూ ఆయనను కారు దగ్గరికి తీసుకొస్తున్నారు.అదే సమయంలో ఓ మద్ధతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు. మరింత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతడి చెంపపై కొట్టాడు. అనంతరం అతనితో ఏదో మాట్లాడి కారువైపు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా చెంపదెబ్బ తిన్న మద్దతుదారుడు కూడా సిద్ధరామయ్య వెనుకాలే నవ్వుతూ కారు దగ్గరికి వెళ్లాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement