Friday, May 3, 2024

కాంగ్రెస్ గూటికి.. మాజీ సీఎం జగదీష్‌ షెట్టర్‌

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో అలకబూనిన షెట్టర్… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బెంగళూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే… జగదీష్ షెట్టర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి… పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో AICC ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌, సీనియర్‌ నేత సిద్దరామయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement