Friday, May 10, 2024

ఎగిరే హైబ్రీడ్ కారు – గంట‌కు 160మైళ్ల కంటే ఎక్కువ వేగం

కారు ఎగురుతుందా ..అదేం ప్ర‌శ్న ఎందుకు ఎగురుతుంది అనుకుంటున్నారా..కానీ ఈ మాట‌ని నిజం చేస్తోంది ఓ సంస్థ‌. గాలిలో ఎగిరే హైబ్రీడ్ కారుకి అనుమ‌తి కూడా ల‌భించిందండోయ్. ఎయిర్ కార్ క్రాఫ్ట్ గా పిల‌వ‌బ‌డుతోన్న ఈ కారు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంద‌ట‌. యూరోపియ‌న్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ప్రమాణాల ప్రకారం 70 గంటల కఠినమైన పరీక్షల సమయంలో 200 కంటే ఎక్కువ టేకాఫ్ మరియు ల్యాండింగ్ లను పూర్తి చేసిన తర్వాత ఈ ఎయిర్ కార్ క్రాఫ్ట్ కి స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీచే ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ పొందింది. ఇది డ్యూయల్-మోడ్ వాహనం, ఇది మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో రోడ్డు వాహనం నుండి విమానంగా మారుతోంది. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజన్ ను ఈ కారులో అమర్చారు. ఇది సాధారణ పెట్రోల్ కారుగా ఉండనుంది. ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేలా ఈ కారు రూపొందింది. 8,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో , గంటకు 160 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement