Sunday, April 28, 2024

నీ య‌వ్వ‌, పుష్పా క్రేజ్ త‌గ్గేదేలే.. శ్రీవ‌ల్లి సాంగ్‌కి స్టెప్పులేసిన క్రికెట‌ర్‌ బ్రేవో..

ఐకాన్ స్టార్ బ‌న్నీ లీడ్ రోల్‌లో న‌టించిన పుష్పా మూవీకి సూప‌ర్ డూప‌ర్ హిట్టు టాక్ వ‌చ్చింది. ఆ సినిమాలో పాట‌లు కూడా అదే రేంజ్‌లో హిట్ట‌య్యాయి. ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా దేశ, విదేశాల్లో అవే పాట‌లు వేస్తున్నారంటే మ్యూజిక‌ల్‌గా జ‌నాల‌ను ఎంత అట్రాక్ట్ చేశాయో చెప్పుకోవ‌చ్చు. అయితే ఇప్ప‌టికే పుష్పా మూవీ సాంగ్స్‌కి చాలా మంది క్రికెట‌ర్లు స్టెప్పులేశారు.

ఈ సారి వెస్టిండిస్ క్రికెట‌ర్ ద్వాన్ జాన్ బ్రావో (డీజే బ్రావో) కూడా త‌న‌దైన స్టైల్‌లో బ‌న్నీని అనుక‌రించాడు. త‌న స్టెప్పులతో జ‌నాల‌ను అల‌రిస్తూ.. ఇంత‌కు ముందే ఈ పాట‌కు స్టెప్పులేసిన క్రికెట‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, సురేశ్ రైనాను ట్యాగ్ చేశాడు. ఇన్‌స్టాలో ఉన్న త‌న ఈ వీడియో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి మ‌రి..

Advertisement

తాజా వార్తలు

Advertisement