Monday, December 11, 2023

ఆర్మీ వాహ‌నంలో మంట‌లు.. న‌లుగురు జ‌వాన్లు స‌జీవ ద‌హనం

ప్ర‌మాద‌వ‌శాత్తు ఆర్మీ వాహ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు జ‌వాన్లు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం ఫూంజ్ జిల్లా తోటగలి గ్రామ సమీపంలో రాగానే ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం మొత్తం మంటలు వ్యాపించగా, తప్పించుకునే వీలులేకపోవడంతో నలుగురు జవాన్లు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీస్, ఆర్మీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కాగా ఈ వాహ‌నం పూంచ్ – జమ్మూ హైవేపై వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని చెప్పారు అధికారులు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement