Thursday, April 25, 2024

నేర నియంత్రణకు విసిబుల్ పోలీసింగ్ : ఎస్పీ మేరీ ప్రశాంతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : నేర నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టేందుకు, రహదారి ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు విజిబుల్ పోలీసింగ్ ను నిర్వహించారు. 17,18, 19వ తేదీల్లో మొత్తం ఈ-చలాన్‌లు – 2,188 విధించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు నడిపే వారిపై 1,336 కేసులు, వాహనాలు నడిపే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: 377 కేసులు, వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండా నడిపిన వారిపై: 02 కేసులు, ద్విచక్ర వాహనలాపై ముగ్గురు వాహనంపై ప్రయాణం చేసిన వారిపై 31 కేసులు, అతివేగం నిర్లక్ష్యంగా నడిపిన వారిపై 05 కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై: 25 కేసులు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై: 102 కేసు లు నమోదు చేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం వలన ప్రాణహాని ఉండదని, ఏదైనా ప్రమాద సమయంలో మీకు ప్రాణ రక్షణగా హెల్మెట్ ఉంటదని, ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వేగం వద్దు ప్రాణం ముద్దు అని, వాహనాలు నడిపే సమయంలో మీపై మీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ట్రాఫిక్ నియమనిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement