Tuesday, April 30, 2024

పుష్ప‌2 లో స‌రికొత్త‌గా ఫైట్స్ , డ్యాన్స్

పుష్ప ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వంద కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మొత్తంగా చూసుకుంటే 330 కోట్లకి పైగా రాబట్టింది. ఈ సినిమాలోని ఫైట్స్ .. బన్నీ సిగ్నేచర్ స్టెప్స్ జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటి ‘రీల్స్’ విపరీతంగా కనిపించాయి. ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలైపోయాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. పుష్ప సినిమాలోకి మించి ఈ సినిమాలో స్టెప్పులు .. ఫైట్లు ఉండాలని సుకుమార్ తో బన్నీ చెప్పాడట. దాంతో యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డ్యాన్స్ కొరియోగ్రఫర్లు కొత్తదనం కోసం కసరత్తు మొదలెట్టారని సమాచారం. అంతకుమించి అన్నట్టుగా ‘పుష్ప 2 ఉంటుందని బన్నీ ముందుగానే చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement