Tuesday, April 23, 2024

నెగెటివ్ రోల్ లో త‌మిళ స్టార్ హీరో ‘అజిత్’

త‌మిళ‌స్టార్ హీరో అజిత్ నెగెటివ్ రోల్ లో క‌నిపించ‌నున్నార‌ట‌. అజిత్ కి ఒక డైరెక్టర్ టేకింగ్ నచ్చితే ఫ్లాపులు వచ్చినా పెద్దగా పట్టించుకోడు. ఆ డైరెక్టర్ తోనే వరుస సినిమాలు చేస్తూ వెళతాడు. అలా ఆయన దర్శకుడు హెచ్. వినోద్ తో ‘నెర్కొండ పార్వై’ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వలిమైకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయినా ఆయన దర్శకత్వంలోనే తన తాజా చిత్రాన్ని చేస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ రోల్ నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందట‌ ఒక పవర్ఫుల్ రోల్ కోసం దక్షిణాది నుంచే మరో స్టార్ ను రంగంలోకి దింపుతున్నారట. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement