Thursday, April 25, 2024

రక్తంతో తడిసిన జాతీయ రహదారి.. టిప్పర్ ఢీకొని 40 గొర్రెలు మృతి

కర్నూలు జిల్లాలోని 40వ నెంబర్ జాతీయ రహదారి మూగజీవాల రక్తంతో తడిసి ముద్దయింది. బుధవారం ఉదయాన్నే కంకర టిప్పర్ మూగజీవాల పైకి దూసుకురావడంతో అక్కడికక్కడే 20 గొర్రెలు మృతి చెందగా 20 గొర్రెలు వివిధ రకాలుగా అంగవైకల్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే బేతంచెర్ల మండలం బుగ్గన పల్లి తండా, బుగ్గన పల్లె గ్రామానికి చెందిన పది మంది గొర్రెల కాపరులు 3000 గొర్రెలను మేత కోసం రాయమాలుపురము తీసుకుని వెళ్లడానికి మంగళవారం రాత్రి బయలుదేరారు. తెల్లవారుజాము నుండే జాతీయ రహదారి వెంట గొర్రెలను తోలుకొని వస్తుండగా బలపనూరు మెట్ట సమీపంలో ఉన్న మైదానంలో గొర్రెలను నిలుపుకోవడానికి రోడ్డు దిగుతుండగ తమ రాజు పల్లిలో కంకర లోడ్ చేసుకొని నంద్యాల వైపు వస్తున్న టిప్పర్ వేగంగా దూసుకెళ్లడంతో గొర్రెలు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాయి. బుగ్గన పల్లి గ్రామానికి చెందిన శీను, సుబ్బరాయుడు లవి ఇరవై గొర్రెల దాకా మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఎఎస్సై ఆర్ ఎo భాషలు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement